Film News

వార్తలు నువ్వే దేవుడివి సామీ…. పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ సెటైర్!

పవన్ కళ్యాణ్ ను నేను ఎప్పుడూ దేవుడు అనే నమ్ముతాను. తిరుమల బాలాజీ, యాదగిరి గుట్ట నరసింహ స్వామి, భద్రాచలం రాముడు…. లాంటి దేవుళ్లను పవన్ కళ్యాణ్ తో రీప్లేస్ చేస్తే బావుంటుంది అంటూ ట్వీట్ చేసారు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సెటైరిక్ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఎప్పుడూ దేవుడు అనే నమ్ముతాను. తిరుమల బాలాజీ, యాదగిరి గుట్ట నరసింహ స్వామి, భద్రాచలం రాముడు…. లాంటి దేవుళ్లను పవన్ కళ్యాణ్ తో రీప్లేస్ చేస్తే బావుంటుంది అంటూ ట్వీట్ చేసారు.
ఇటీవల జరిగిన ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పలువురు పవన్ కళ్యాణ్ భజన చేసిన నేపథ్యంలో వర్మ ఇలాంటి ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. పవన్ కు సన్నిహితంగా ఉండే నిర్మాత బండ్ల గణేష్ మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే..

మోహన్ బాబుకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది… ఇలా తిరిగిచ్చేస్తున్నాడు

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుl

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులకు సన్మానం చేసారు. వక్తలు మాట్లాడుతూ మోహన్ బాబు సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

బాహుబలి బడ్జెట్, లాభాల లెక్కలపై….. నిర్మాత చెప్పిన షాకింగ్ వాస్తవాలు!

ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్, మొదటి భాగం రిలీజ్ తర్వాత తమకు ఎంత లాభాలు వచ్చాయనే విషయాలు వెల్లడించారు.

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు… ఓవరాల్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం 2015లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 2017 లో రెండో భాగం విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను హైదరాబాద్, ముంబైలలో గురువారం నిర్వహించారు. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్, మొదటి భాగం రిలీజ్ తర్వాత తమకు ఎంత లాభాలు వచ్చాయనే విషయాలు వెల్లడించారు..

ఫైనల్ అయిపోయింది… ఉయ్యాలవాడ గా మెగాస్టార్, ఎవరీ నరసింహారెడ్డి తెలుసా??

మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు, ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు.

ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. మొన్నటికి మొన్న హీరో శ్రీకాంత్ చెప్పాక కొంత నమ్మకం కుదిరింది జనాలకి.. అయినా ఇంకా ఎక్కడో అనుమానమే ఎందుకంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోయే సురేంద్ర రెడ్డి గానీ అధికారికంగా చెప్పకపోవటమే. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు…..